logo

హోరాహోరీగా ఎడ్ల బండలాగుడు పోటీలు

లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ టు వైఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల్లో భాగంగా శుక్రవారం సబ్‌జూనియర్‌

Published : 15 Jan 2022 03:59 IST

ప్రథమ బహుమతి విజేత తిషిగ్నారెడ్డికి బహుమతి అందజేస్తున్న నిర్వాహకులు

గుడివాడ, న్యూస్‌టుడే: లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ టు వైఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల్లో భాగంగా శుక్రవారం సబ్‌జూనియర్‌ విభాగంలో పోటీలు నిర్వహించారు. మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని పోటీలను ప్రారంభించారు. వర్షం వచ్చినా పోటీలు కొనసాగించారు. పాల్గొన్న పశుపోషకులకు జ్ఞాపికలు అందజేశారు. అలాగే సేధ్యపు విభాగంలో జరిగిన పోటీల్లో తొలి 9 స్థానాలు సాధించిన ఎడ్ల యజమానులకు ₹ 2.70 లక్షల నగదు బహుమతులు అందజేశారు. పులగం తిషిగ్నారెడ్డి(గుంటూరు-కుంచనపల్లి), సోమిశెట్ట ఆంజనేయులు (గుంటూరు), తోట శ్రీనివాసరావు (గుంటూరు-పెదకాకాని), కళ్లం అనూషరెడ్డి, మనోజ్‌రెడ్డి(కృష్ణా జిల్లా-కళ్లంపాలెం), పటేళ్ల సుధాకరరెడ్డి (ప్రకాశం-ఉప్పుమాగులూరు), కందుల రాజ్యలక్ష్మి(గుంటూరు-పాపాయిపాలెం), డి.రోహన్‌బాబు(హైదరాబాద్‌), బావినేని ధార్మికరామ్‌చౌదరి, ఆకర్ష్‌చౌదరి(కృష్ణ-పెనమలూరు), మేల్పల ప్రసన్నరెడ్డి(తెలంగాణ-రంగారెడ్డి జిల్లా-నాదర్‌గుల్‌)కు వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్‌, అడపా బాబ్జి, పాలేటి చంటి, ఎంవీ నారాయణరెడ్డి బహుమతులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని