Mobiles: 28 వేల మొబైల్స్‌ బ్లాక్‌ చేయండి.. టెల్కోలకు డాట్‌ ఆదేశం

సైబర్‌ నేరాలతో ముడిపడి ఉన్న 28 వేల మొబైల్స్‌ను బ్లాక్‌ చేయాలని టెలికాం కంపెనీలకు డాట్‌ ఆదేశాలు జారీ చేసింది.

Published : 10 May 2024 19:29 IST

దిల్లీ: సైబర్‌ నేరాలతో సంబంధం ఉన్న 28,200 మొబైల్‌ ఫోన్లను బ్లాక్‌ చేయాలని టెలికాం కంపెనీలను డాట్‌ (DoT) ఆదేశాలు జారీ చేసింది. అలాగే, 20 లక్షల మొబైల్‌ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని సూచించింది. సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర హోంశాఖ, డాట్, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన అనాలిసిస్‌లో వీటిని గుర్తించినట్లు డాట్ ఓ ప్రకటనలో తెలిపింది.

‘‘హోంశాఖ, పోలీసులతో కలిసి చేపట్టిన అనాలసిస్‌లో 28,200 మొబైల్‌ హ్యాండ్ సెట్లను సైబర్‌ నేరగాళ్లు వినియోగించినట్లు తేలింది. అంతేకాదు ఈ ఫోన్లను వినియోగించి సుమారు 20 లక్షల మొబైల్‌ కనెక్షన్లను కూడా దుర్వినియోగం చేసినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ హ్యాండ్‌సెట్లను బ్లాక్‌ చేయడంతో పాటు 20 లక్షల మొబైల్‌ కనెక్షన్లను రీ వెరిఫై చేయాలి’’ అని టెలికాం కంపెనీలకు డాట్ ఆదేశాలు జారీ చేసింది.

‘ఈ లేఆఫ్‌లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్‌ సమాధానమిదే..!

టెలికాం మోసాలకు సంబంధించి రెండు నెలల క్రితం ఛక్షు పోర్టల్‌ను డాట్‌ ప్రారంభించింది. ఈ పోర్టల్ ప్రారంభించాక ఫిషింగ్‌ ఎస్సెమ్మెస్ లు పంపిస్తున్న 52 సంస్థలను బ్లాక్‌ చేసింది. 348 మొబైల్‌ హ్యాండ్‌సెట్లను బ్లాక్‌ చేసింది. 10,834 అనుమానాస్పద మొబైల్‌ నంబర్లను రీవెరిఫై చేయాలని ఆదేశించింది. ఇదికాకుండా మొబైల్‌ డివైజ్‌లకు సంబంధించి 1.58 లక్షల ఐఎంఈఐ నంబర్లను డాట్‌ బ్లాక్‌ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 1.66 కోట్ల మొబైల్‌ కనెక్షన్లను రద్దు చేసింది. ఇందులో 53.78 లక్షల కనెక్షన్లను అనుమతికి మించి సిమ్‌ కార్డులు తీసుకున్నారన్న కారణంతో డిస్‌ కనెక్ట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని