logo

సంక్షేమ సహాయకుడి దాడిపై మహిళ ఫిర్యాదు

జగనన్న చేదోడు పథకం కింద ఈ ఏడాది నగదు జమ కాలేదని సచివాలయ సంక్షేమ సహాయకుడిని అడిగితే అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు తనపై దౌర్జన్యం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published : 25 Jan 2022 03:51 IST

సచివాలయ సిబ్బందితో బాధితురాలి వాగ్వాదం

తమిరిశ (నందివాడ), న్యూస్‌టుడే : జగనన్న చేదోడు పథకం కింద ఈ ఏడాది నగదు జమ కాలేదని సచివాలయ సంక్షేమ సహాయకుడిని అడిగితే అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు తనపై దౌర్జన్యం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ గ్రామానికి చెందిన తప్పిట నీలిమ ఇంటి వద్ద దర్జీగా పనిచేస్తోంది. చేదోడు పథకం కింద గతేడాది ఆమెకు ప్రభుత్వం రూ. 10 వేలు మంజూరు చేసింది. ఈ ఏడాది నగదు జమ కాకపోవడంతో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ని అడిగేందుకు రెండు రోజుల కిందట భర్తతో కలిసి సచివాలయానికి వెళ్లింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారితీసింది. దీనిపై నీలిమ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే తనను పథకం జాబితా నుంచి తప్పించాడని అడిగేందుకు వెళ్తే తనతో అసభ్యకరంగా ప్రవర్తించి దౌర్జన్యం చేసినట్లు తెలిపింది. సంక్షేమ సహాయకుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్న చేదోడు పథకానికి ప్రత్యేకంగా షాపు, వర్కర్లను పెట్టుకుని దర్జీ వృత్తిని చేసే వారినే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టిందన్నారు. అందుకే ఇళ్లలో కుట్టు పనిచేసే వారిని ఎంపిక చేయలేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా వినకుండా నీలిమ తన విధులకు ఆటంకం కలిగించిందన్నారు. తనపై దౌర్జన్యం చేసి కొట్టిందన్నారు. దీనిపై నందివాడ ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ ఇద్దరి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని