logo

పోలీస్‌ కమిషనరేట్‌కు ఎక్స్‌లెన్స్‌ అవార్డు

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పౌరులకు అందిస్తున్న అత్యుత్తమ సేవలకు ఎక్స్‌ప్రెస్‌ కంప్యూటర్స్‌ సంస్థ ఎక్స్‌లెన్స్‌ అవార్డును అందించింది.

Published : 24 Feb 2022 04:45 IST


వర్చువల్‌ పద్ధతిలో అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పౌరులకు అందిస్తున్న అత్యుత్తమ సేవలకు ఎక్స్‌ప్రెస్‌ కంప్యూటర్స్‌ సంస్థ ఎక్స్‌లెన్స్‌ అవార్డును అందించింది. విజయవాడ కమిషనరేట్‌లోని యూనిఫైడ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలోని ‘మిత్ర కియోస్క్‌’ ప్రజలకు చక్కని సేవలు అందించినందుకు ఎక్స్‌ప్రెస్‌ కంప్యూటర్‌ డిజిటల్‌ టెక్నాలజీ సభ ఎక్స్‌లెన్స్‌ అవార్డు-2022ని కైవసం చేసుకుంది. మిత్ర కియోస్క్‌ ద్వారా శాంతిభద్రతలు, పబ్లిక్‌ సర్వీసెస్‌, రహదారి భద్రత, పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌, అవుట్‌రీచ్‌, మహిళల భద్రత, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అమలు తదితర సేవలకు ఈ అవార్డు లభించింది. సీపీ కార్యాలయంలో నిర్వహించిన వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా ఈ అవార్డును అందుకున్నారు.

మిత్ర కియోస్క్‌ ద్వారా ఉత్తమ సేవలు

లబ్బీపేటలోని సమీకృత పోలీస్‌ సేవా కేంద్రంలో మిత్ర కియోస్క్‌ను అందుబాటులో ఉంచారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కియోస్క్‌ను పోలీస్‌స్టేషన్లకు అనుసంధానం చేస్తారు. దీనిని ఉపయోగించి నేరుగా ఎఫ్‌ఐఆర్‌ కాపీలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్ఛు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించవచ్ఛు గుర్తు తెలియని మృతదేహాల ఆచూకీ, ఏపీ పోలీస్‌ డైరెక్టరీ, ఈ చలానా పరిస్థితి, చలానా చెల్లింపులు, మహిళా భద్రత, పిటిషన్‌ విచారణ, నిజ నిర్ధారణ వంటి సేవలు పొందవచ్ఛు ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా మాట్లాడుతూ.. కియోస్క్‌ టెక్నాలజీ సేవలపై విజయవాడ పోలీసులకు అవార్డు రావటం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ డీసీపీ డి.మేరీప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని