logo
Published : 02/12/2021 06:13 IST

నిధుల మళ్లింపు బాధాకరం

కుందుర్పిలో నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులు, నాయకులు

కుందుర్పి, న్యూస్‌టుడే: కేంద్రం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీలకు వెనక్కి ఇవ్వాలని మండలంలోని పలువురు సర్పంచులు డిమాండు చేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట మండల తెదేపా కన్వీనర్‌ ధనుంజయ, నాయకుల ఆధ్వర్యంలో సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకోసం నిధులను మళ్లించడం బాధాకరమన్నారు. నిధులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపట్టాలని కరిగానిపల్లి, తూమకుంట సర్పంచులు మల్లికార్జున, రామాంజనేయులు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని కన్వీనర్‌ విమర్శించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందించారు. నాయకులు విశ్వేశ్వరప్రసాద్‌, మల్లికార్జున, శ్రీనివాసులు, తిప్పేస్వామి, నారాయణప్ప, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

శెట్టూరు: కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమచేయాలని తెదేపా మద్దతుదారులైన శెట్టూరు, చింతర్లపల్లి, చిన్నంపల్లి సర్పంచులు కుమార్‌, గౌరమ్మ, అనూరాధ డిమాండ్‌ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం వినతిపత్రం అందించారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని