logo

దసరా ఉత్సవ శోభ

శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఖాద్రీశుడు, మత్స్యావతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు.

Published : 27 Sep 2022 03:08 IST


మత్స్యావతారంలో ఖాద్రీశుడు

కదిరి, న్యూస్‌టుడే : శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఖాద్రీశుడు, మత్స్యావతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు.

ప్రశాంతి నిలయంలో..
పుట్టపర్తి: ప్రశాంతి నిలయంలో దసరా వేడుకలు ప్రారంభం అయ్యాయి. సోమవారం సాయికుల్వంత్‌ మందిరంలోని ధ్యాన మందిరంలో వేద పండితులు గణపతి పూజ నిర్వహించి కలశస్థాపన చేశారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వేదపరుష సప్తాహజ్ఞాన యజ్ఞం ఈ నెల 29న ప్రారంభం కానుంది. వేడుకలకు ట్రస్టు వర్గాలు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. సాయి పూర్వ విద్యార్థులు సత్యసాయి భక్తిగీతాలను శ్రవ్యంగా ఆలపించారు. భక్తులు మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు మేనేజింగ్‌  ట్రస్టీ ఆర్‌.జె.రత్నాకర్‌, సత్యసాయి గ్లోబుల్‌ ఛైర్మన్‌ చక్రవరి తదితరులు పాల్గొన్నారు.


కలశస్థాపన పూజా కార్యక్రమంలో ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, వేద పండితులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని