logo

ఏకకాలంలో భూ రీసర్వే

జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో భూ రీసర్వేకు శ్రీకారం చుడుతున్నాం. ప్రతిఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు.

Published : 07 Dec 2022 04:15 IST

సమీక్షిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, పక్కన జేసీ కేతన్‌గార్గ్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో భూ రీసర్వేకు శ్రీకారం చుడుతున్నాం. ప్రతిఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో జేసీ కేతన్‌గార్గ్‌తో కలిసి తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీఓలకు ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. తొలి విడతగా జిల్లాలో 41 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తయింది. మిగతా గ్రామాల్లో ఒకేసారి రీసర్వేకు పూనుకోవాలి. 10,204.35 చదరపు కిలోమీటర్ల భూమిని వచ్చే డిసెంబరు నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ వేగంగా కొనసాగడానికి ప్రతి మండలానికి ఉప తహసీల్దారును నియమించాం. వీరి సారథ్యంలో ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ ఒక్కటే కాదు.. పంచాయతీశాఖ సైతం ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. భూ రీసర్వే ఎలా చేపట్టాలన్న దానిపై జేసీ కేతన్‌గార్గ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. భూసర్వే, రికార్డుల శాఖ ఏడీ రామకృష్ణన్‌, డీపీఓ ప్రభాకర్‌రావు, ఆర్డీఓలు రవీంద్ర, సుధారాణి, అనంత నగర పాలక సంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని