logo

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ

Published : 29 Mar 2024 04:09 IST

భర్తను హతమార్చిన భార్య

పామిడి, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ్ల గ్రామానికి చెందిన లక్ష్మన్న(54) కనిపించడం లేదని భార్య పద్మావతి ఈ నెల 15న దేవనకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. విచారణ చేపట్టగా వివాహేతర సంబంధానికి భర్త లక్ష్మన్న అడ్డుగా ఉన్నాడని పద్మావతి తన కుమారుడు వెంకటేశ్‌, ప్రియుడు బుడ్డ మల్లయ్యతో కలిసి గత నెల 17న హతమార్చినట్లు తేలిందన్నారు. అదేరోజు రాత్రి పామిడి 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పెన్నా పరివాహక ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లినట్లు తెలిపారు. నెల రోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదని పద్మావతి ఫిర్యాదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఆమెపై అనుమానంతో విచారించగా కుమారుడు, ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించారని తెలిపారు. నిందితులను గురువారం ఉదయం పామిడికి తీసుకువచ్చి పెన్నా పరివాహక ప్రాంతంలో లక్ష్మన్న మృతదేహాన్ని పడేసిన ప్రాంతంలో గాలించగా అస్తిపంజరం లభ్యమయింది. స్థానిక ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి పంచనామా చేపట్టారు.


వాలంటీర్లపై కేసులు నమోదు

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: ఉద్దేహాళ్‌లో వైకాపా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇటీవల పాల్గొన్న మండలంలోని హరేసముద్రం, గోవిందవాడ గ్రామ సచివాలయ వాలంటీర్లు రాముడు, సుధాకర్‌లపై ఎంపీడీవో విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మనహాళ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు.


రూ.32.16 లక్షల మద్యం సీజ్‌

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ఎన్నికల క్షేత్ర స్థాయి నిఘా టీంలు నగదు, మద్యంపై దృష్టి సారించాయి. తాజాగా 6,52,390 నగదు సీజ్‌ చేశారు. దీనితో కలిపితే ఇప్పటి దాకా మొత్తం 26,46,890 నగదును పట్టుకున్నారు.  4340.34 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. దీని ఖరీదు రూ.32,16,070 ఉంటుందని అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని