logo

రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ

రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 25 Apr 2024 05:17 IST

ర్యాలీగా వెళ్తున్న కాలవ శ్రీనివాసులు, నాయకులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా అభయాంజనేయస్వామి, శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామి, జమ్మి చెట్టు బన్ని మహాంకాళి ఆలయాల్లో కుటుంబసభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం తెదేపా, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో కాలవ శ్రీనివాసులు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలతో రాయదుర్గం పసుపుమయంగా మారింది. డప్పులు, వీరగాసుల నృత్యాలు, కీలు గుర్రాలు, కళాకారులు, నందికోళ్లు, తప్పెట్లతో ర్యాలీ ఆకట్టుకొంది. నామినేషన్‌ వేశాక కాలవ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీటీపీకి కృష్ణాజలాలు సాధిస్తానని, ఉంతకల్లు రిజర్వాయరు పనులు ప్రారంభించి పదేళ్లల్లో పూర్తి చేస్తామన్నారు. హెచ్చెల్సీ ఆధునీకీకరణ పనులు పూర్తి చేస్తానన్నారు. రాయదుర్గం బాలికల జూనియర్‌ కళాశాలను పూర్తి చేసి ప్రారంభిస్తానని, కణేకల్లులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని