logo

వైకాపా ఎమ్మెల్యే సోదరుడికి చేదు అనుభవం

బుక్కపట్నం మండలంలోని బుచ్చయ్యగారిపల్లి గ్రామానికి చెందిన రామాంజినమ్మకు మూడేళ్ల కిందట జగనన్న గృహం మంజూరైంది. మంజూరు పత్రం సైతం అందించారు.

Updated : 30 Apr 2024 04:30 IST

ఇంటి మంజూరు పత్రాన్ని చూపుతున్న రామాంజినమ్మ
బుక్కపట్నం, న్యూస్‌టుడే : బుక్కపట్నం మండలంలోని బుచ్చయ్యగారిపల్లి గ్రామానికి చెందిన రామాంజినమ్మకు మూడేళ్ల కిందట జగనన్న గృహం మంజూరైంది. మంజూరు పత్రం సైతం అందించారు. గృహ నిర్మాణాన్ని మాత్రం చేసుకోనివ్వలేదు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చయ్యగారిపల్లికి వెళ్లారు. వైకాపాకు ఓటు వేయాలని రామాంజినమ్మను అభ్యర్థించగా ఆమె మాట్లాడుతూ ‘మీ ప్రభుత్వంలో ఇల్లు మంజూరు చేశారు. నిర్మాణానికి మాత్రం వాలంటీరు అడ్డుపడ్డాడు. కనీసం పునాది కూడా వేసుకునేందుకు అనుమతివ్వలేదు. దీనిపై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి సైతం విన్నవించాం. పరిశీలిస్తామన్నారు తప్ప సమస్య తీర్చలేదు. ఎలా వేయాలి ఓటు’ అని ఆమె నిలదీసింది. స్థానిక నాయకులు జోక్యం చేసుకుని ఆన్‌లైన్‌లో ఉంటుందంటూ చెప్పగా మిమ్మల్ని కూడా అడిగాం. మీరు కూడా మాకు న్యాయం చేయలేదని ఆమె చెప్పడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని