logo

వాలంటీరుకు దేహశుద్ధి

మండలంలోని ఓ గ్రామంలో మాజీ మహిళా వాలంటీరును సెల్‌ఫోన్‌లో వేధించిన మరో వాలంటీరుకు సోమవారం బంధువులు, గ్రామస్థులు దేహశుద్ధి చేశారు

Published : 30 Apr 2024 04:45 IST

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామంలో మాజీ మహిళా వాలంటీరును సెల్‌ఫోన్‌లో వేధించిన మరో వాలంటీరుకు సోమవారం బంధువులు, గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. గ్రామంలో ఏడుగురు వాలంటీర్లు ఉండగా అందులో ఐదుగురు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మహిళా వాలంటీరుకు ఓ వాలంటీరు సెల్‌ఫోన్‌లో వేధించేవాడు. గతంలో గ్రామస్థులు అతణ్ని మందలించి పంచాయితీ కూడా చేశారు. అయినా అతడు పద్ధతి మార్చుకోకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ సెల్‌ఫోన్‌లో పోస్టులు పెట్టాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు వాలంటీరును చితకబాదారు. ఈవిషయంపై పోలీసులను విచారించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని