logo

తెదేపా అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణీ వసుంధర అన్నారు. నేడు ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు, మెడలో గొలుసుల చోరీలు, వేధింపులు పెరిగి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 02 May 2024 03:38 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె తేజస్విని, వసుంధర, బ్రాహ్మణి

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణీ వసుంధర అన్నారు. నేడు ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు, మెడలో గొలుసుల చోరీలు, వేధింపులు పెరిగి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం జరిగిందని పోలీసులను ఆశ్రయించినా న్యాయం దక్కని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల మహిళలు తమకు అండగా నిలిచి అభివృద్ధికి కృషిచేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే ఎన్నికల్లో ఓట్లు వేయాలన్నారు.

హిందూపురం మరింత అభివృద్ధి

హిందూపురం శాసనసభ్యుడిగా బాలకృష్ణను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే హిందూపురాన్ని మరింత అభివృద్ధి చేసి అగ్రస్థానానికి తీసుకెళతారని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి, కుమార్తెలు నారాబ్రాహ్మణి, తేజస్విని అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక జేవీఎస్‌ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన స్త్రీశక్తి మహిళా సాధికారత సమావేశంలో వీరు మాట్లాడారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణపై ఉన్న విశ్వాసంతో రెండు దఫాలు ఎన్నికల్లో గెలిపించారని మూడోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో సీసీ రహదారులు, మురుగుకాలువలు ఏర్పాటు చేశారని దశాబ్దాలుగా పట్టణ ప్రజలను వేధిస్తున్న నీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించారని, లేపాక్షికి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు, హంద్రీనీవా కాలువల ద్వారా చెరువులకు నీరు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి రూ.2 కే మధ్యాహ్నం భోజనం, నియోజకవర్గంలో ప్రతి పల్లెకు ఆరోగ్యరథంతో ఉచిత వైద్యం, హెరిటేజ్‌ సంస్థ ద్వారా పాఠశాలలకు కంప్యూటర్లు, టీవీలు, కరోనా సమయంలో ఉచితంగా మందులు, క్యాన్సర్‌ బారినపడిన వారికి బసవతారక ఇండో అమెరికల్‌ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించారని ఈ ఎన్నికల్లో  ఓట్లు వేసి గెలిపిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తారన్నారు. సమావేశంలో తెదేపా నాయకురాళ్లు సుమిత్రి, మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రావిళ్లలక్ష్మి, పరిమళ, శ్రీదేవి, వెంకటలక్ష్మి, విజయలక్ష్మి, మంజుళ, భారతి, మహాలక్ష్మి, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

హాజరైన మహిళలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు