logo

కన్నుపడితే కబ్జానే

రాయదుర్గంలో వైకాపా నాయకులు వంకలు, రిజర్వుడ్‌ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుసుకొని ఆక్రమించేస్తున్నారు.

Published : 08 May 2024 05:34 IST

కోతిగుట్టలో వంకను ఆక్రమించి చదును చేశారిలా..

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: రాయదుర్గంలో వైకాపా నాయకులు వంకలు, రిజర్వుడ్‌ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుసుకొని ఆక్రమించేస్తున్నారు. కోతిగుట్టలో 300-ఎ సర్వే నంబరులో సుమారు ఎకరాకుపైగా వంక పొరంబోకు స్థలం ఉంది. దాన్ని ఆనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేందుకు మంగళవారం ఉదయం ఓ వైకాపా నాయకుడు పొక్లెయిన్‌తో చదును చేయిస్తుండగా స్థానికులు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడికి చేరుకొని పొక్లెయిన్‌ను పోలీసులకు అప్పగించారు. ఇదే ప్రాంతంలో ఏడాది క్రితం ఓ వైకాపా నాయకుడు తమ వ్యాపార సముదాయానికి పక్కనే ఉన్న స్థలాన్ని  ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో అతడు 10అడుగుల మేర స్థలాన్ని మట్టివేసి చదును చేసి స్వాహా చేసేందుకు యత్నిస్తున్నాడు. సంబంధిత అధికారులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు