logo

నేటి నుంచి వేరుసెనగ విత్తు పంపిణీ ప్రారంభం

జిల్లాలో ఖరీఫ్‌లో వేరుసెనగ సాగు రైతులకు గురువారం నుంచి రాయితీ వేరుసెనగ విత్తు పంపిణీ ప్రారంభించనున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ బుధవారం తెలిపారు.

Published : 23 May 2024 01:45 IST

అక్రమాలకు పాల్పడితే చర్యలు

మురళీకృష్ణ 

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలో ఖరీఫ్‌లో వేరుసెనగ సాగు రైతులకు గురువారం నుంచి రాయితీ వేరుసెనగ విత్తు పంపిణీ ప్రారంభించనున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ బుధవారం తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కే6, నారాయణి రకాలకు సంబంధించి 38,655 క్వింటాళ్ల వేరుసెనగ విత్తును ఏపీ విత్తన సంస్థ ద్వారా ఆర్‌బీకేలకు సరఫరా చేసి నిల్వ చేశామన్నారు. రాయితీపై కె6 రకం విత్తు 30 కిలోల బస్తా రూ.1,710, నారాయణి రకం రూ.1,746గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటిని రైతుల వేలిముద్ర ఆధారిత నమోదుతో అందజేస్తామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంపిణీ చేయాలని ఏవోలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఇవి కావలసిన రైతులు ఆర్బీకేలను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పంపిణీలో అక్రమాలకు పాల్పడితే అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విత్తన కొరత లేదని, అర్హులైన రైతులందరికీ విత్తన కాయలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని