logo

గంగమ్మను స్మరించి.. విశ్వరూప దర్శనంతో తరించి

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది.

Published : 23 May 2024 02:03 IST

చెంప నరికే క్రతువుతో ముగిసిన జాతర

హారతి ఇస్తున్న విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. ఈనెల 14న ప్రారంభమైన జాతర బుధవారం వేకువజామున గంగమ్మ విశ్వరూప ప్రతిమ చెంపకోసే కార్యక్రమంతో పూర్తయింది. వారంరోజుల పాటు నగరంలో జాతర సంబరాలు కనిపించాయి. వివిధ రకాల వేషధారణలతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తప్పెట్లు, తాళాల ధ్వనులతో నగరం మార్మోగింది. బూతులు తిడుతూ భక్తులు సందడిగా బంధుమిత్రులతో కలిసి జాతరను సంతోషంగా ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు.

సూర్యకిరణాలు పడకుండా తెరను అడ్డుగా ఉంచిన విశ్వబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు

చంప నరికే కార్యక్రమం ఆలస్యం.. గంగమ్మ గుడి ఆవరణలోని కొడి స్తంభానికి అమ్మవారి విశ్వరూప ప్రతిమ ఏర్పాటు చేస్తారు. మంగళవారం గర్భాలయంలోని గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేకం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట వరకు చేశారు. తర్వాత కొడి స్తంభం వద్ద అమ్మవారి మట్టి విగ్రహం తయారీకి ఉపక్రమించారు. పేరంటాళ్లు వచ్చి విశ్వరూప గంగమ్మ చంప కోస్తే జాతర ముగుస్తుంది. గతేడాది ఈ ప్రక్రియ వేకువ జామున 4 గంటలకే ముగించారు. బుధవారం సూర్యోదయం తర్వాత 6.40 గంటలకు నిర్వహించారు. కార్యక్రమం ఆలస్యంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అమ్మవారి విశ్వరూప ప్రతిమపై  సూర్యకిరణాలు పడకుండా తెర ఏర్పాటు చేశారు. ఈ విషయంలో గంగమ్మ భక్తులు తిరుపతి ప్రజలు ఏమిటీ విచిత్ర పరిస్థితి అంటూ పెదవి విరిచారు.

మట్టికోసం..

కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం

పోటాపోటీగా లాక్కుంటున్న దృశ్యం

అమ్మవారికి సారె తెస్తున్న భక్తురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని