logo

స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలోని స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించారు.

Published : 23 May 2024 12:27 IST

తిరుపతి :  ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలోని స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉందన్నారు.  ఈనెల 13న  ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడినట్లు చెప్పారు. కౌంటింగ్‌ లో ఈవీఎంల ఇబ్బందులు తలెత్తకుండా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిలో కౌంటింగ్‌ ఏజెంట్స్‌ను బెదిరిస్తున్నారని, కౌంటింగ్‌  ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అసత్య ప్రచారం చేసే వారిపై సైబర్‌ క్రైమ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని