logo
Published : 29/11/2021 06:30 IST

చౌక బియ్యం పక్కదారి

 

పోలీసులు పట్టుకున్న రేషన్‌ బియ్యం (దాచిన చిత్రం)

న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ, పీలేరు గ్రామీణ : నిరుపేదల కోసం ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తోంది. ఇది చాలా ప్రాంతాల్లో పక్కదారి పడుతోంది. కొందరు లబ్ధిదారులు అదనపు ధరకు వ్యాపారులకు విక్రయిస్తుంటే మరి కొన్ని ప్రాంతాల్లో డీలర్ల నుంచే పక్క దారి పడుతున్నట్లు తెలుస్తోంది.

సన్న బియ్యంగా మార్చేస్తున్నారు

కార్డుదారుల నుంచే కాకుండా కొందరు అక్రమంగా చౌకదుకాణాల నుంచి సేకరించిన బియ్యాన్ని రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. ఇక్కడ పాలీష్‌ చేసి సన్న బియ్యంగా మారుస్తున్నారు. ఆ తర్వాత కొంత వంటనూనె ఇందులో కలిపి పాల సోనామసూర, సన్నబియ్యంగా మార్చి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు లబ్ధిదారుల వద్ద చౌక బియ్యాన్ని కిలో రూ.10కి కొనుగోలు చేసి హోల్‌సేల్‌ వ్యాపారులకు రూ.15కు విక్రయిస్తున్నారు. ఆ తరువాత రైస్‌మిల్లుల్లో పాలీష్‌ చేసి కిలో రూ.30కి విక్రయిస్తున్నారని విమర్శలున్నాయి.

అక్రమాలకు నిదర్శనం

మదనపల్లె డివిజన్‌లో 8కి పైగా పౌరసరఫరాల గిడ్డంగులు ఉన్నాయి. మదనపల్లె పరిధిలో ప్రతి నెల 1350 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ అవుతోంది. ఈ ఏడాది మే 10వ తేదీన రెండు లారీల్లో పీడీఎస్‌ బియ్యం కడప జిల్లా బద్వేలు నుంచి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇందులో వెయ్యి బస్తాలను సీజ్‌ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

జూన్‌ 19న నెల్లూరు జిల్లా నుంచి మదనపల్లె పట్టణం మీదుగా కర్ణాటక రాష్ట్రానికి వెయ్యి బస్తాల బియ్యాన్ని రెండు లారీల ద్వారా తరలిస్తుండగా స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. 200 క్వింటాళ్ల బియ్యం నేరుగా పౌర సరఫరాల గిడ్డంగి నుంచే అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడింది.

పీలేరు పట్టణ శివారు కామాటంపల్లెకు చెందిన ఓ నాయకుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని డీలర్లు, పేదల వద్ద నుంచి రేషన్‌ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి భద్రపరిచి రీసైక్లింగ్‌ చేశాడు. దీనిని తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. 5 క్వింటాళ్లు స్వాధీనం చేసుకొని 10 మంది డీలర్లపై కేసులు నమోదు చేశారు.

తనిఖీలు చేస్తున్నాం

రేషన్‌ బియ్యం ఇవ్వలేదని వచ్చిన ఫిర్యాదులపై తనిఖీలు చేశాం. మూడు చౌక దుకాణాలను సీజ్‌ చేశాం. అలాగే 3వ నంబరు దుకాణంపై వచ్చిన ఆరోపణలపై తనిఖీ చేస్తే బియ్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారణ అయింది. రైస్‌మిల్‌ను తనిఖీ చేశాం. -శ్రీనివాసులు, తహసీల్దార్‌, మదనపల్లె

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని