logo

వీరాంజనేయస్వామి విగ్రహం ధ్వంసం

వి.కోట, న్యూస్‌టుడే: వి.కోట మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో ఉన్న వీరాంజనేయస్వామి విగ్రహం ధ్వంసం విషయమై ఆదివారం కలకలం రేపింది. దేవాలయం ఎదుట సిమెంటుతో తయారుచేసిన ఈ విగ్రహం చేతులు, మొహం విరిగిన విషయాన్ని గుర్తించిన కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

Published : 17 Jan 2022 03:13 IST

వి.కోట, న్యూస్‌టుడే: వి.కోట మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో ఉన్న వీరాంజనేయస్వామి విగ్రహం ధ్వంసం విషయమై ఆదివారం కలకలం రేపింది. దేవాలయం ఎదుట సిమెంటుతో తయారుచేసిన ఈ విగ్రహం చేతులు, మొహం విరిగిన విషయాన్ని గుర్తించిన కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. ఎవరూ ధ్వంసం చేయలేదని, పగుళ్ల కారణంగా విగ్రహం ధ్వంసమైనట్లు కనిపిస్తోందని ఆలయ నిర్వాహకులు తెలిపినట్లు సీఐ ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని