logo

పట్టుగూళ్ల కొరత.. మూతపడుతున్న రీలింగ్‌ కేంద్రాలు

పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గుముఖం పట్టడంతో రీలింగ్‌ కేంద్రాలు మూతపడుతున్నాయి. దీనిపై ఆధారపడిన రీలింగ్‌ కేంద్రాల యజమానులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో రీలర్లకు దొరకడం లేదు. మదనపల్లె పట్టుగూళ్ల విక్రయకేంద్రానికి గూళ్లు రోజుకు 200 కిలోలు లోపే వస్తున్నాయి. వారంలో

Published : 24 Jan 2022 05:01 IST


తాత్కాలికంగా మూతపడిన రీలింగ్‌ కేంద్రం

 

మదనపల్లె(పట్టణం): పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గుముఖం పట్టడంతో రీలింగ్‌ కేంద్రాలు మూతపడుతున్నాయి. దీనిపై ఆధారపడిన రీలింగ్‌ కేంద్రాల యజమానులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో రీలర్లకు దొరకడం లేదు. మదనపల్లె పట్టుగూళ్ల విక్రయకేంద్రానికి గూళ్లు రోజుకు 200 కిలోలు లోపే వస్తున్నాయి. వారంలో రెండు మూడు రోజులు రావడం లేదు. రీలర్ల డిమాండ్‌కు తగ్గట్టుగా గూళ్లు లభించకపోవడంతో వారు బయటప్రాంతాలకు తరలివెళుతున్నారు. మదనపల్లెలో 35 వరకు రీలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 500 మందికిపైగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పట్టుగూళ్ల కొరత కారణంగా 15 కేంద్రాలు మూతపడినట్లు తెలిసింది. ఒకరిద్దరైతే రీలింగ్‌ కేంద్రాన్ని పూర్తిగా మూసివేసి చికెన్‌సెంటర్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. పనిచేస్తున్న రీలింగ్‌కేంద్రాల నిర్వాహకులు మాత్రం బయటప్రాంతాలకు వెళ్లి పట్గుగూళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారికి అదనంగా ఆర్థిక భారం పడుతోంది. పలమనేరు, కుప్పం నుంచి పట్టుగూళ్లను కొనుగోలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని