logo

ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశానుసారం 1,500 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నచోట అదనపు పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు డీఆర్‌వో రాజశేఖర్‌ తెలిపారు.

Published : 05 Oct 2022 05:52 IST

రాజకీయ పార్టీల ప్రతినిధులతో  మాట్లాడుతున్న డీఆర్‌వో రాజశేఖర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశానుసారం 1,500 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నచోట అదనపు పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు డీఆర్‌వో రాజశేఖర్‌ తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023పై మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులతో నిర్వహించిన సమావేశంలో డీఆర్‌వో మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 1,737 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 1,500కి మించి ఓటర్లు ఉన్న కేంద్రాలు లేవన్నారు. ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ 50.67 శాతం జరిగిందన్నారు. పోలింగ్‌ కేంద్రాల మార్పుపై ఫార్మెట్‌-1లో వచ్చిన 12 అభ్యంతరాల్ని పరిష్కరించామన్నారు. ఫార్మెట్‌-2లో 57 పోలింగ్‌ కేంద్రాలను మార్చినట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలు బీఎల్‌వోలకు సహకరించి ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానాన్ని పూర్తిచేయాలన్నారు. సమావేశంలో అధికారులు పద్మజ, పార్థసారథి, వివిధ రాజకీయ పార్టీల నేతలు మురుగేష్‌, ప్రేమ్‌ కుమార్‌, సురేంద్రకుమార్‌, చిట్టిబాబు, జ్ఞానరాజు, అశోక్‌కుమార్‌, మురళి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని