logo

రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్‌ విడుదల

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం తిరుపతి పర్యటన వివరాలను కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి వెల్లడించారు.

Published : 03 Dec 2022 01:52 IST

శ్రీవారి ఆలయం ఎదుట భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌, జేసీ, ఎస్పీ తదితరులు

తిరుపతి (నగరం, నేరవార్తలు), తిరుమల: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం తిరుపతి పర్యటన వివరాలను కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి వెల్లడించారు. ఆదివారం రాత్రి 9.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఆపై రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని పద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 9.25 గంటలకు వరాహస్వామివారిని, ఆపై శ్రీవారిని దర్శించుకుంటారు. 11.35 గంటలకు అలిపిరి గోమందిరం చేరుకుని అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11.55 గంటలకు శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ః రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టరు వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటన మార్గాల్లో శుక్రవారం భద్రతను పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయంలో ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని