logo

బహుళ ప్రణాళికల సృష్టి కేంద్రం ఎంబీయూ: సీతారాం

ఎంబీయూ 31వ వార్షికోత్సవం చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయంలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

Published : 21 Mar 2023 03:02 IST

వార్షికోత్సవానికి విచ్చేస్తున్న మోహన్‌బాబు, సీతారాం

చంద్రగిరి: ఎంబీయూ 31వ వార్షికోత్సవం చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయంలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐసీటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారాం మాట్లాడుతూ ఎంబీయూ బహుళ ప్రణాళికల సృష్టి కేంద్రమని కొనియాడారు. ముందుగా ఎంబీయూ ఛాన్స్‌లర్‌ మంచు మోహన్‌బాబు, ప్రొ ఛాన్స్‌లర్‌ విష్ణు.. ముఖ్య అతిథులతో కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినీ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌, సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మోహన్‌బాబు నియమ నిబద్ధత గల వ్యక్తి అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థను స్థాపించామన్నారు. ప్రతిభావంతులకు పసిడి పతకాలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.థమన్‌, ఉప కులపతి ఆచార్య నాగరాజ రామారావు, రిజిస్ట్రార్‌ పార్థసారథి, పలు విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు