logo

మంత్రి దృష్టికి కాణిపాకం సమస్య

కాణిపాకం గ్రామ పంచాయతీ.. శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం మధ్య నెలకొన్న పార్కింగ్‌ రుసుం సమస్యను సర్పంచి కె.శాంతిసాగర్‌రెడ్డి, వైకాపా నాయకులు ఆదివారం తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి నివాసానికి వెళ్లి వివరించారు.

Published : 27 Mar 2023 03:25 IST

సమస్యను మంత్రి పెద్దిరెడ్డికి వివరిస్తున్న సర్పంచి శాంతిసాగర్‌రెడ్డి, నాయకులు

కాణిపాకం: కాణిపాకం గ్రామ పంచాయతీ.. శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం మధ్య నెలకొన్న పార్కింగ్‌ రుసుం సమస్యను సర్పంచి కె.శాంతిసాగర్‌రెడ్డి, వైకాపా నాయకులు ఆదివారం తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి నివాసానికి వెళ్లి వివరించారు. పంచాయతీ పార్కింగ్‌ రుసుం ప్రస్తుతం 60 శాతం పంచాయతీకి, 40 శాతం ఆలయానికి ఇస్తున్నారని, అలా కాకుండా 80 శాతం ఆలయానికి 20 శాతం గ్రామ పంచాయతీకి ఇచ్చేలా శనివారం జరిగిన పాలకమండలి తీర్మానించిందని ఆయనకు చెప్పారు.గతంలో ఉన్నరీతినే కొనసాగించేలా ఆలయ అధికారులు, పాలకమండలికి తగిన అదేశాలు ఇవ్వాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ఆలయ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని సర్పంచి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని