జంతు ప్రేమికులు
తిరుపతికి చెందిన కొంతమంది యువత వీధి కుక్కల సంరక్షణకు నడుంబిగించారు. సకాలంలో ఆహారం, నీళ్లు అందించడంతోపాటు నిలువ నీడ లేకుండా ఆపదలో ఉండే వీధి కుక్కలను గుర్తించి వాటికి అవసరమైన వసతులు సమకూర్చుతున్నారు.
వీధి శునకాల సంరక్షణలో యువత
వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న సంస్థ సభ్యులు
తిరుపతికి చెందిన కొంతమంది యువత వీధి కుక్కల సంరక్షణకు నడుంబిగించారు. సకాలంలో ఆహారం, నీళ్లు అందించడంతోపాటు నిలువ నీడ లేకుండా ఆపదలో ఉండే వీధి కుక్కలను గుర్తించి వాటికి అవసరమైన వసతులు సమకూర్చుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వాటికి పశువైద్యుల సహాయంలో చికిత్స అందించి మానవత్వాన్ని చాటుతున్నారు. అనాథ]లుగా ఉండకూడదనే లక్ష్యంతో నెలలోపు ఉన్న వీధి కుక్క పిల్లలను దత్తత ద్వారా ఆసక్తిగల వారికి అందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి ప్రశంసలు అందుకుంటున్నారు.
న్యూస్‌టుడే, తిరుపతి(గాంధీరోడ్డు)
తిరుపతికి చెందిన యువతి దివ్యారెడ్డి వీధి కుక్కల సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ‘హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ అనిమల్స్’ సంస్థను స్థాపించి వాటి బాగోగులు చూస్తున్నారు. ఆమెతో పాటు మరో 15 మంది వాలంటీర్లుగా మారి తిరుపతి నగరంలోని రెండు మార్గాలను ఎంచుకున్నారు. లక్ష్మీపురం నుంచి ఎమ్మార్‌పల్లి కూడలి వరకు, కపిలతీర్థం నుంచి వీవీమహల్ రోడ్డు వరకు ఉన్న వీధి శునకాలకు ఆహారం, వైద్యం అందిస్తున్నారు. వాలంటీర్లు రెండు గ్రూపులుగా వీడిపోయి వారి పరిధిలో ఉండే రెస్టారెంట్ల సహకారంతో మిగిలి ఆహారాన్ని సేకరించి వీధి కుక్కలకు అందిస్తుంటారు. ఇలా వారంలో నాలుగు రోజులు సోమ, బుధ, శుక్ర, ఆదివారం క్రమం తప్పకుండా ఆహారాన్ని సేకరించి వాటికి అందిస్తారు. వీటిల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వాటిని గుర్తించి పశువైద్యుల సహాయంలో చికిత్స అందిస్తూ జంతు ప్రేమికులుగా ప్రశంసలు అందుకుంటున్నారు.
దత్తతకు శ్రీకారం
వీధి కుక్క పిల్లను దత్తత ఇస్తున్న దివ్యారెడ్డి
సంస్థ సభ్యుల సంరక్షణలో ఉన్న కొన్ని వీధి కుక్కలు ఈనగా.. వాటి పిల్లలను దత్తత ద్వారా ఆసక్తిగల వారికి అందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా కొంత మంది జంతు ప్రేమికులు విదేశీ శునకాలను వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. వాటికి ఇక్కడి వాతావరణం సహకరించక పోవడంతో సంబంధిత యజమానులు ప్రత్యేక గది, ఏసీ వంటి సౌకర్యాలు కల్పిస్తుంటారు. దేశీయ వీధి కుక్కలకు ఎండను, వర్షాన్ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. దీనిపై సంస్థ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా వీధి కుక్కల సంరక్షణకు తోడ్పాటును అందిస్తున్నారు. ఇందుకు వీధి కుక్కలు ఈనిన పిల్లలను గుర్తించిన వాలంటీర్లు నెలరోజుపాటు ప్రత్యేకంగా పర్యవేక్షించి వాటిని ఆసక్తిగల వారికి అందిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 35 కుక్కపిల్లలను దత్తత ఇచ్చారు.
విశేష స్పందన వస్తోంది
ఇటీవల తెలంగాణలో వీధి శునకాల దాడిలో బాలుడు మృతిచెందడంతో వాటిని చంపడం బాధ కలిగించింది. వీధి కుక్కలు విశ్వాసంగా ఉంటూ ఎంతోమందిని కాపాడిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిటికి కుని శస్త్రచికిత్స చేయకపోవడం వల్ల మానసిక స్థితి కోల్పోయి ఆ విధంగా ప్రవర్తిస్తుంటాయి. దీనిపై అవగాహన కల్పించి వీధి కుక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నిర్ణయంతో సంస్థ స్థాపించాం. ప్రస్తుతం దత్తత కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.
దివ్యారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: ధోనీ - రామ్‌చరణ్ మీట్.. మాళవిక నో ఫిల్టర్ లుక్.. నిధి క్వీన్..!
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
-
Chandrababu Arrest: ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్: బాలకృష్ణ
-
Jammu Kashmir: కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి