logo

ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ

మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్‌వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 25 Apr 2024 03:33 IST

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్‌వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన ఓటరు నమోదు, మార్పు/చేర్పులు చేసుకున్న ఓటర్లకు సంబంధించి ఆరు వేల ఎపిక్‌ కార్డులు ఈ నెల 29న జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఇంటి నుంచి ఓటుపై సర్వే జరుగుతోందని, 1950కి ఫోన్‌ చేసి ఓటరు కార్డు సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. పీవో, ఏపీవో, ఓపీవోలకు మే 3 నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, మే 5న ఆర్‌వోల సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించడం జరుగుతుందన్నారు. డీఆర్‌వో పుల్లయ్య, శ్రీనివాసులు(భాజపా), పరదేశి (కాంగ్రెస్‌), గంగరాజు (సీపీఎం), ఉదయ్‌కుమార్‌ (వైకాపా), సురేంద్రకుమార్‌(తెదేపా) పాల్గొన్నారు.

పరిశీలకులకు ఫిర్యాదు చేయండి..

ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను జిల్లా ఎన్నికల పరిశీలకులకు తెలియజేయొచ్చని కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. చిత్తూరు ఎంపీ సెగ్మెంగ్‌-వ్యయ పరిశీలకులు శంకర్‌ప్రసాద్‌శర్మ (92814 48308), నగరి/జీడీనెల్లూరు సాధారణ పరిశీలకులు కైలాశ్‌వాంఖడే (92814 48305), చిత్తూరు/ పూతలపట్టు/ పలమనేరు/కుప్పం సాధారణ పరిశీలకులు-సాధిక్‌ అలం (92814 48302), పుంగనూరు/నగరి/జీడీనెల్లూరు వ్యయ పరిశీలకులు శ్రీనివాస్‌ ఖన్నా(92814 48307), చిత్తూరు/పూతలపట్టు/పలమనేరు/కుప్పం వ్యయ పరిశీలకులు రోహన్‌ ఠాకూర్‌ (92814 48306).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని