icon icon icon
icon icon icon

Chandrababu: ప్రజల భూములు.. ఇప్పుడు సైకో జగన్‌ గుప్పిట్లో..: చంద్రబాబు

ప్రజల భూములపై జగన్‌ పెత్తనమేంటని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 04 May 2024 15:23 IST

దర్శి: ప్రజల భూములపై జగన్‌ పెత్తనమేంటని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడిగుద్దుల వర్షం కురిపించారని ఎద్దేవా చేశారు. పింఛను రూ.2వేలకు పెంచింది తెదేపా ప్రభుత్వ హయాంలోనేనని చెప్పారు. ‘‘మన మ్యానిఫెస్టో కళకళ.. జగన్‌ది విలవిల’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

‘‘నేను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారు. బడ్జెట్‌లో 19 శాతం సంక్షేమానికి ఖర్చు చేశా. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 శాతం మాత్రమే ఇచ్చారు. అధికారంలోకి రాగానే జే బ్రాండ్‌ మద్యం నిషేధిస్తాం. నాణ్యమైన లిక్కర్‌ను తక్కువ ధరకు ఇస్తాం. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు?ఆయన ఫొటో ఉన్న పాసు పుస్తకాలను చించిపారేయాలి. ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్ తీసుకొచ్చారు. ప్రజల భూములను జగన్‌ తన దగ్గర పెట్టుకుంటారంట. భూమి రికార్డులను ప్రైవేట్‌ సంస్థకు ఇచ్చారు. మీ భూమి ఇప్పుడు సైకో జగన్‌ గుప్పిట్లో ఉంది. భూమి మీది.. పెత్తనం జలగది. సైకో అందరి మెడలకు ఉరితాడు వేశారు. జగన్‌ ఎప్పుడు లాగితే అప్పుడు మీ ప్రాణం పోతుంది. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత నాది’’ అని అన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ అవినాష్‌రెడ్డి చిన్నపిల్లాడని జగన్‌ చెబుతున్నారని.. అలా అయినప్పుడు పలకా బలపం ఇచ్చి స్కూలుకు పంపించాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు చెప్పిన జగన్‌ నవరత్నాలివీ..

1. ఇసుక మాఫియా

2. జే బ్రాండ్‌ మద్యం

3. భూ మాఫియా

4. మైనింగ్‌ మాఫియా

5. హత్యా రాజకీయాలు

6. ప్రజల ఆస్తుల కబ్జా

7. ఎర్ర చందనం, గంజాయి

8. దాడులు, అక్రమ కేసులు

9. శవ రాజకీయాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img