logo

రామచంద్రయాదవ్‌పై 28 కేసులు

బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. 

Published : 26 Apr 2024 04:18 IST

ఆర్వో మధుసూదనరెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న బీసీవైపీ అభ్యర్థి రామచంద్రయాదవ్‌

పుంగనూరు: బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి.    పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మొత్తం 15 మంది 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు  బీసీవైపీ తరఫున  రామచంద్రయాదవ్‌ నాలుగు సెట్లు, తెదేపా తరఫున చల్లా రామచంద్రారెడ్డి -2, ఆయన కుమార్తె చల్లా పూజారెడ్డి-1, వైకాపా తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-2, ఆయన సతీమణి స్వర్ణలత -2, ఎస్‌డీపీఐ తరఫున 1, స్వతంత్రులు -1 నామినేషన్‌ దాఖలు చేశారు.

ప్రధాన పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు’ 

నియోజకవర్గంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య చీకటి ఒప్పందాలు కొనసాగుతున్నాయని బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ ఆరోపించారు. గురువారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక ఆర్వో కార్యాలయంలో పుంగనూరు నియోజకవర్గ బీసీవైపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తులు పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. దౌర్జన్యాలు, అక్రమాలు అధికమయ్యాయని, ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు.

 ఆస్తుల వివరాలు

  • నియోజకవర్గం:  పుంగనూరు
  • అభ్యర్థి: రామచంద్రయాదవ్‌
  • పార్టీ: బీసీవైపీ 
  •  విద్యార్హత: ఎంబీఏ
  • స్థిరచరాస్తులు: రూ.10.36 కోట్లు
  • బంగారం: 596 గ్రాములు
  • అప్పులు: 1.82 కోట్లు
  • కేసులు: 28
  • నియోజకవర్గం: పూతలపట్టు
  • అభ్యర్థి: ఎం.ఎస్‌.బాబు
  • పార్టీ: కాంగ్రెస్‌
  • విద్యార్హతలు: ఏడో తరగతి
  • స్థిరచరాస్తుల విలువ: రూ.1.55 కోట్లు
  • భార్య పేరిట: రూ.50 వేలు
  • అప్పులు: లేవు
  • కేసులు: నాలుగు క్రిమినల్‌ కేసులు

 న్యూస్‌టుడే, పూతలపట్టు, ఐరాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని