logo

పది, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు

పదోతరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) జి.నరసింహులు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Published : 23 May 2024 04:40 IST

రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: పదోతరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) జి.నరసింహులు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి జూన్‌ 3 వరకు పదోతరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను 44 కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు 9,230 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి జూన్‌ 1 వరకు 25 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 19,794 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు మాట్లాడుతూ ఓపెన్‌ స్కూల్‌కు సంబంధించి పదోతరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 1 నుంచి 8 వరకు జరుగుతాయన్నారు. అయిదు కేంద్రాల్లో జరిగే ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌  సప్లిమెంటరీకి 1,135, మూడు కేంద్రాల్లో జరిగే ఓపెన్‌ స్కూల్‌ పదోతరగతి సప్లిమెంటరీకి 556 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. హాల్‌టికెట్లు, గుర్తింపు ఐడీ కార్డులతో గంట ముందు హాజరు కావాలన్నారు. ఆర్‌ఐవో ఎన్‌.ఎల్‌.వి.ఎల్‌.నరసింహారావు మాట్లాడుతూ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసి 9492226232 ఫోన్‌ నంబరు అందుబాటులో ఉంచామన్నారు. సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని