logo

ఐసీయూల్లో ఉక్కబోత

కాకినాడ జీజీహెచ్‌ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి ఏఎంసీయూ, ఎస్‌ఐసీయూ, ఆర్‌ఐసీయూ, ఆర్థో, గైనిక్, ఎమర్జన్సీ,

Published : 23 May 2024 05:08 IST

ఏసీలు లేని వైనం

ఎస్‌ఐసీయూలోని గోడకు ఒక్క ఏసీ లేకుండా.. 

మసీదుసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జీజీహెచ్‌ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి ఏఎంసీయూ, ఎస్‌ఐసీయూ, ఆర్‌ఐసీయూ, ఆర్థో, గైనిక్, ఎమర్జన్సీ, కార్డియాలజీ, పీడియాట్రిక్స్, న్యూరో తదితర విభాగాలకు చెందిన సుమారు పదికి పైగా ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసీయూ)ల్లో పూర్తిస్థాయిలో ఏసీలు లేవు. ఉన్నచోట్లా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. అరకొరగా పనిచేస్తున్న ఏసీల నుంచీ చల్లదనం రావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అపసార్మక స్థితిలో ఉన్నవారు,  శస్త్రచికిత్సలు జరిగిన వాళ్లు, వెంటిలేటర్‌పై చికిత్సపొందుతున్నవారినే ఐసీయూల్లో ఉంచి చికిత్స అందిస్తారు. చావుబతుకుల మధ్య ఉన్న రోగులకు పుండు మీద కారం చల్లినట్లు ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇంటి నుంచి ఫ్యాన్‌ తెచ్చుకుని..

ఇంటి నుంచి టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకుని..: వేసవి కాలం కావడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆపై గాలి ఆడక ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జీజీహెచ్‌లోని ఎస్‌ఐసీయూలో 15 నుంచి 20 వరకు మంచాలు ఉండగా గోడకు ఓ పక్క మూడు ఏసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో రోగులు ఇంటి నుంచి టేబుల్‌ ఫ్యాన్లు, విసనకర్రలు  తెచ్చుకుంటున్నారు. ఏఐసీయూ, ఆర్‌ఐసీయూల్లో సైతం రెండుమూడు ఏసీలు మాత్రమే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు