logo
Published : 30/11/2021 06:29 IST

వీరు పట్టుకున్నారు.. వారు వదిలేశారు


చినకొండేపూడి వద్ద రెవెన్యూ అధికారులు పట్టుకున్న లారీలు

సీతానగరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పరిధిలో ఎడమగట్టును కొంత మంది అక్రమంగా తవ్వి లారీల్లో తరలించడంపై పెద్ద దుమారం రేగింది. పెదకొండేపూడి సమీపంలో పుష్కర కాలువ 1.7 కిలోమీటరు వద్ద ఎడమగట్టుకు రక్షణగా వేసిన రాళ్లతో కూడిన మట్టి (ఎర్త్‌మిక్స్‌డ్‌ బౌల్డర్స్‌) సోమవారం యంత్రాలతో తవ్వేసి పెద్ద లారీల్లో తరలించే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారులకు అందిన సమాచారంతో దాడి చేయగా ఆరు లారీలు, యంత్రాలు పట్టుబడ్డాయి. మట్టిని తరలించేందుకు అనుమతులు ఉన్నాయంటూ గుత్తేదారులుగా వచ్చిన కొంత మంది రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనుమతులు చూపితే వదిలేస్తామని ఆర్‌ఐ గంగరాజు, వీఆర్వో పుల్లారావు స్పష్టం చేశారు. గతంలో ఎడమగట్టు పనులు తాము చేశామని, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు తమకే రావడంతో మట్టి అవసరమై గట్టు తొలగిస్తున్నామని నిర్వాహకులు చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. ప్రధాన కాలువ గట్టును తొలగించడం వల్ల నీటి ప్రవాహానికి గండ్లు పడి గ్రామాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని స్థానికులు తమ వాదన వినిపించారు. వాహనాలను పోలవరం జలవనరుల శాఖకు అప్పగించినట్లు తహసీల్దారు పవన్‌కుమార్‌ పేర్కొన్నారు. సాయంత్రానికి మట్టి లోడుతో ఉన్న లారీలు, యంత్రాలు అక్కడ నుంచి వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికారిక అనుమతి లేకుండా ఎడమగట్టును తవ్వి మట్టి తరలించడంపై రెవెన్యూ అధికారులు సమాచారం ఇచ్చారని జలవనరుల శాఖ పోలవరం జేఈ సుకుమార్‌బాబు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. పోలవరం జల విద్యుత్తు పనులకు మట్టిని తరలిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారన్నారు. లోడింగ్‌ అయిన మట్టిని తవ్విన చోటే దించేసి, మొదటి తప్పుగా వారి నుంచి లేఖ తీసుకుని లారీలు, యంత్రాలను వదిలేశామన్నారు. పోలవరం, పుష్కర గట్లు తవ్వితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలవరం ప్రధాన కాలువ గట్టును తవ్వేస్తున్న యంత్రం

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని