logo

‘అంబేడ్కరా.. ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించు’

పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు ఉద్యమ కార్యాచరణలో భాగంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ, అన్ని తాలూకా కేంద్రాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని, చీకటి జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉ

Published : 27 Jan 2022 04:40 IST


కాకినాడలో అంబేడ్కర్‌ విగ్రహానికి విన్నవిస్తున్నపీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు

కాకినాడ కలెక్టరేట్‌: పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు ఉద్యమ కార్యాచరణలో భాగంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ, అన్ని తాలూకా కేంద్రాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని, చీకటి జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. పీఆర్సీ సాధన సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ధర్నాచౌక్‌ నుంచి ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేడ్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన సాగింది. తర్వాత అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి అందజేశారు. కొత్త జీతాలు మాకొద్ధు. పాత జీతాలే ఇవ్వాలి.. మాయదారి పీఆర్సీ మాకొద్దు బాబోయ్‌ అని నినదించారు.

రిలే దీక్షలు నేటి నుంచే...

పీఆర్సీ సాధన సమితి ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి ఈనెల 30 వరకు కాకినాడ ధర్నాచౌక్‌ వద్ద రిలే దీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ రామ్మోహనరావు, ఏపీ ఐకాస అమరావతి జిల్లా ఛైర్మన్‌ త్రినాథరావు, ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి పి.మూర్తిబాబు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యదర్శి సత్యనారాయణ, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్‌, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని