logo

భవానీ ఆత్మహత్య కారకుల అరెస్టుకు డిమాండ్‌

ఎస్టీ మహిళా ఉద్యోగిని, చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ ఆత్మహత్యకు కారకులైన వైకాపా నాయకులు దంగేటి రాంబాబు, అతని అనుచరులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భవానీ న్యాయపోరాట కమిటీ నాయకులు

Published : 13 Aug 2022 03:41 IST

కలెక్టరేట్‌ ఎదుట నినాదాలు చేస్తున్న దళిత, గిరిజన ప్రజాసంఘాల నాయకులు

అమలాపురం పట్టణం: ఎస్టీ మహిళా ఉద్యోగిని, చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ ఆత్మహత్యకు కారకులైన వైకాపా నాయకులు దంగేటి రాంబాబు, అతని అనుచరులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భవానీ న్యాయపోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. నల్లవంతెన వద్దనున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కమిటీ అధ్యక్షుడు డీబీ లోక్‌ అధ్యక్షతన దళిత, గిరిజన ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌ వరకు వెళ్లి ధర్నా చేశారు. నాయకులు మాట్లాడుతూ భవాని మృతిచెంది 40 రోజులైనా దోషులను అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టర్‌ హిమాన్షుశుక్లాకు భవానీ ఆత్మహత్య కేసులో న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందించారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు జంగా బాబూరావు, పౌరహక్కుల సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు అమలదాసు బాబూరావు, మున్సిపల్‌ విప్‌ బండారు సత్యనారాయణ, రేవు తిరుపతిరావు, ఇ.రఘుబాబు, కె.రాజమణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని