logo

అనిశా వలలో సచివాలయ సర్వేయరు

పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామ సచివాలయంలో సర్వేయరుగా పని చేస్తున్న పి. నాగేశ్వరరావు శుక్రవారం రూ. 10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.

Published : 01 Oct 2022 05:20 IST


పట్టుబడిన నాగేశ్వరరావు

పెద్దాపురం, న్యూస్‌టుడే: పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామ సచివాలయంలో సర్వేయరుగా పని చేస్తున్న పి. నాగేశ్వరరావు శుక్రవారం రూ. 10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. అనిశా డీఎస్పీ సీహెచ్‌. సౌజన్య విలేకరుకు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన నూకరాజుకు కాండ్రకోటలో 10 ఎకరాల 2 సెంట్లు భూమి ఉంది. ఇందులో వైఎస్సార్‌ జగనన్న సర్వే కింద కొలతలు తీసిన నాగేశ్వరరావు దస్త్రాల్లో చూపిన దానికంటే 11 సెంట్లు తక్కువ వస్తుందని, తనకు రూ. 10 వేలు ఇస్తే మళ్లీ  సర్వే చేసి 4 సెంట్లు భూమి దస్త్రాల్లో నమోదు చేస్తానన్నారు. సర్వే చేసి 10 ఎకరాల 6 సెంట్లు నమోదు చేశారు. తర్వాత తనకు ఇస్తానన్న మొత్తం ఇవ్వాలని అడిగారు. దీనిపై రైతు 14400 నంబరుకి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో సర్వేయరు నాగేశ్వరరావు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నామన్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ సతీష్‌, వాసుకృష్ణ, పుల్లారావు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని