logo

జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగేదిలా..

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిసెంబరు 1, 2 తేదీల్లో కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రూట్‌మ్యాప్‌ ఖరారైంది.

Updated : 28 Nov 2022 06:43 IST

నిడదవోలు: తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిసెంబరు 1, 2 తేదీల్లో కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రూట్‌మ్యాప్‌ ఖరారైంది. డిసెంబరు 1న ఏలూరు జిల్లా పోలవరంలో బహిరంగసభ అనంతరం సాయంత్రం 5.30కు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడికిలోకి ప్రవేశిస్తారు. తాడిపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం, చిడిపి, కుమారదేవం, ఆరికిరేవుల మీదుగా కొవ్వూరు చేరుకుంటారు. కొవ్వూరులో గోదావరి మాత విగ్రహం నుంచి రోడ్‌షో చేపట్టి రాత్రి 8 గంటలకు విజయవిహార్‌ కూడలిలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి 9.30 గంటలకు సుందరసాయి ఫంక్షన్‌హాల్‌లో బస చేస్తారు. డిసెంబరు 2న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మహిళా సంఘాలతో సమావేశమవుతారు. 10 గంటలకు కొవ్వూరు మండలం వేములూరు, పశివేదల మీదుగా చాగల్లు మండలం గౌరిపల్లి, మల్లవరం, చంద్రవరం, మార్కోండపాడు, దారవరంల మీదుగా నిడదవోలు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు భోజన విరామం తీసుకుంటారు. 2.30 గంటలకు నందిన స్టీల్స్‌ నుంచి రోడ్‌షో మొదలై గణేష్‌చౌక్‌ కూడలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లిగూడెం వెళ్తారు.


స్నేహామృతమే శక్తినిస్తుంది

స్నేహామృతం ఇచ్చే శక్తి మరేదీ ఇవ్వలేదు. ప్రేమ స్వచ్ఛతను, విలువను తెలియజేసేలా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. డీఎన్‌ఆర్‌ కళాశాలలో ఎం.కాం తొలి బ్యాచ్‌ విద్యార్థినైనా జూనియర్‌ బ్యాచ్‌లోనూ నాకు స్నేహితులు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. మనసంతా చేసే పనిపైనే దృష్టి పెట్టడం, అందులోనే విజయం సాధించడం చిన్నప్పటి నుంచీ అలవాటు చేసుకున్నా. నాకు తెలిసింది సినిమానే. అందుకే కథ, సంగీతం, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో అయిదు విభాగాల్లో పనిచేశా. కుటుంబమంతా కలిసి సినిమా చూడాలన్నదే నా ఆలోచన. కరోనా విపత్తు సమయంలో దొరికిన ఖాళీ సమయంలో అయిదు సినిమాలకు అవసరమైన కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకున్నా. జీవితంలో ఆరోగ్యంగా ఉండటమే నిజమైన ఐశ్వర్యం.  

-రాయవరంలో నిర్వహించిన డీఎన్‌ఆర్‌ కళాశాల పూర్వ సమ్మేళనంలో ఎస్వీ కృష్ణారెడ్డి
-న్యూస్‌టుడే, రాయవరం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని