logo

ఘంటసాల విగ్రహావిష్కరణ నేడు

అమలాపురం ఎర్రవంతెన కాటన్‌పార్కులో ఆదివారం సాయంత్రం 4 గంటలకు పద్మశ్రీ ఘంటసాల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సినీనటుడు, రచయిత, దర్శకుడు ఎల్బీ శ్రీరామ్‌ తెలిపారు.

Published : 04 Dec 2022 02:57 IST

వివరాలు వెల్లడిస్తున్న ఎల్బీ శ్రీరామ్‌, ప్రతినిధులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురం ఎర్రవంతెన కాటన్‌పార్కులో ఆదివారం సాయంత్రం 4 గంటలకు పద్మశ్రీ ఘంటసాల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సినీనటుడు, రచయిత, దర్శకుడు ఎల్బీ శ్రీరామ్‌ తెలిపారు. ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు పళ్ల వీరభద్రత్రినాథ్‌ ఆధ్వర్యంలో అమలాపురం అశోక్‌నగర్‌ వేడుక మందిరంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఎల్బీ శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘కోనసీమ ప్రాంతం నేదునూరుకు చెందిన లంక భద్ర శ్రీరామ్‌ అనే నేను సినిమారంగాన్ని వెతుక్కుంటూ వెళ్లాను. 12 ఏళ్లు రచయితగా చేసిన నాకు చాలాబాగుంది.. సినిమా హాస్యనటుడిగా గుర్తింపునిస్తే, అమ్మో ఒకటో తారీఖు సినిమా నటుడిగా పేరు తెచ్చింది. ఈనాడు అధినేత రామోజీరావు దయ మరువలేనిది’’ అన్నారు. 500 సినిమాలు చేశానని, 5 నంది అవార్డులు గెలుచుకున్నానని తెలిపారు. అనుకున్నది సాధించి ఎక్కడకి వెళ్లానో.. అక్కడికే వచ్చా.. కోనసీమలో 60 షార్ట్‌ఫిల్మ్‌లు తీయడంపై దృష్టిపెడుతున్నానన్నారు. కమెడియన్‌ విగ్రహావిష్కరణ చేయడమేమిటి.. అన్నవారికి ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహావిష్కరణకు ఘంటస్తంభం వెంకటేశ్వరరావు రాకూడదా.. అని చమత్కరించారు. అనంతరం ఆయన్ని కమిటీ సభ్యులు సత్కరించారు. కమిటీ కార్యదర్శి ఆకుల రవితేజ, ఉపాధ్యక్షుడు సుదా గణపతి, సహ కార్యదర్శి పి.చిట్టిబాబు, మోకా సుబ్బారావు, గుర్రం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని