రోడ్డు ప్రమాదంలో బౌన్సర్ దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన గురువారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. చాగల్లు మండలం బ్రాహ్మణగూడేనికి చెందిన కోలాటి అభిలాష్ (29) రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు సంస్థలో బౌన్సరు.
అభిలాష్ (పాత చిత్రం)
కొవ్వూరు పట్టణం, చాగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన గురువారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. చాగల్లు మండలం బ్రాహ్మణగూడేనికి చెందిన కోలాటి అభిలాష్ (29) రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు సంస్థలో బౌన్సరు. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై తెల్లవారుజామున ఇంటికి వస్తున్నారు. రోడ్‌కం రైలు వంతెనపై అప్రోచ్ మార్గానికి చేరేసరికి వాహనం అదుపు తప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొంది. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అభిలాష్ తండ్రి కాంతారావు ఫిర్యాదుపై పట్టణ ఎస్సై భూషణం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నపుడు తండ్రి ఎన్నిసార్లు ఫోను చేసినా అతను ఎత్తలేదు. 4.30 గంటలు దాటాక ఎవరో ఫోను ఎత్తి చనిపోయిన సమాచారాన్ని ఇచ్చారు. అభిలాష్‌కు భార్య, ఏడాదిన్నర వయస్సున్న బాబు, అయిదు నెలల పాప ఉన్నారు. బ్రాహ్మణగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..