logo

సప్తగోదావరిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతాం

ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం చెంతనున్న సప్తగోదావరి నదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.

Published : 06 Jun 2023 05:28 IST

ద్రాక్షారామ సప్తగోదావరి నదిలో పూడికతీత పనుల్లో పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ

ద్రాక్షారామ: ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం చెంతనున్న సప్తగోదావరి నదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సప్తగోదావరి నదిలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పూడిక తీత పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతసేపు కూలీలతోపాటు పలుగుతో మట్టి తవ్వి, గమేళాలకు ఎత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పురావస్తు శాఖ అనుమతితో అనేక అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. భక్తులు శుద్ధమైన నీటిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోనేరును ప్రక్షాళన చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచి కొత్తపల్లి అరుణ, ఆలయ ఈవో తారకేశ్వరరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు