logo

కూటమి విజయం అవసరం: పురందేశ్వరి

ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి కూటమి విజయం అవసరమని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Published : 05 May 2024 03:57 IST

మాట్లాడుతున్న పురందేశ్వరి, చిత్రంలో బత్తుల

కోరుకొండ, న్యూస్‌టుడే: ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి కూటమి విజయం అవసరమని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కోరుకొండ మండలంలో ఆమె ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణతో కలిసి శనివారం ప్రచారం నిర్వహించారు. గాడాల, బూరుగుపూడి, దోసకాయలపల్లి, గాదరాడ తదితర గ్రామాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఐదేళ్ల క్రితం చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకున్నామని, తిరిగి అది జరగకూడదంటే కూటమిని గెలిపించుకోవాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎసీˆ్ట వర్గాలకు ఏం న్యాయం చేశారని జగన్‌ను ప్రశ్నించారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా, అక్కడ బల్ల, కుర్చీ కూడా లేదన్నారు. దళిత యువకుడిని హత్యచేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పోలవరం, రాజధాని విషయంలో వెనుకబడ్డామన్నారు. మద్యం విషయంలో ప్రజల్ని దగా చేశారని, మహిళలకు రక్షణ లేదని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలు పెరిగాయని, మరిన్ని ఆగడాలు పెరిగే రోజులు రాకుండా అధికార పార్టీని ఓడించాలన్నారు. తెదేపా ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణచౌదరి, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్ర, నందమూరి రామకృష్ణ, నీరుకొండ వీరన్నచౌదరి, తనకాల నాగేశ్వరరావు, తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని