logo

హజ్‌ యాత్రకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్‌

హజ్‌ యాత్రకు వెళ్లేవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ భవనంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

Published : 08 May 2024 06:29 IST

రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్‌టుడే: హజ్‌ యాత్రకు వెళ్లేవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ భవనంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, అల్లూరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 57 మంది యాత్రికులకు వ్యాక్సిన్లు వేశామన్నారు. గోదావరి హజ్‌ కమిటీ అధ్యక్షుడు ఎండీ హబీబుల్లాబేగ్‌, సభ్యుడు షేక్‌ నూరుద్దీన్‌, సభ్యులు శిబిరానికి హాజరై సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీహరిబాబు, ఆయా జిల్లాల ఇమ్యునైజేషన్‌ అధికారులు రత్నకుమార్‌, నాగేశ్వరరావు, దేవసుధ, శ్రీనివాసమూర్తి, వైద్యనిపుణులు పాల్గొన్నారు.

పింఛన్లు పంపిణీ చేయని ఇద్దరికి నోటీసులు

గోపాలపురం, న్యూస్‌టుడే: చిట్యాల గ్రామంలో సర్పంచితోపాటు మరో ఎనిమిది మందికి వచ్చిన సామాజిక పింఛను సొమ్ములు అందించడంలో అలసత్వం వహించిన ఇద్దరు ఉద్యోగులకు ఎంపీడీవో కే.రమేష్‌ మంగళవారం షోకాజ్‌ నోటీసులు అందించారు. ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. గ్రేడ్‌-5 సెక్రటరీ, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు