logo

రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి

రాజీ పడదగిన అన్ని రకాల కేసులను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.

Published : 10 May 2024 05:21 IST

దానవాయిపేట (రాజమహేంద్రవరం): రాజీ పడదగిన అన్ని రకాల కేసులను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్‌లో డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్‌బాబు ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ చిట్‌ఫండ్‌ సంస్థల ప్రతినిధులు, ఆ సంస్థల న్యాయవాదులతో సమావేశం జరిగింది. జూన్‌ 29న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు పరిష్కరించడంతో పాటు బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధాన న్యాయమూర్తి చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ఆయా సంస్థల సివిల్‌, కాంపౌండబుల్‌ క్రిమినల్‌ కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయసేవాధికార సంస్థకు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్‌.శివకుమార్‌, ఎనిమిదో అదనపు జిల్లా న్యాయమూర్తి వై.బి.నాయుడు, తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి, పదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్‌.శ్రీలత, రెండో అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జి ఎ.కృష్ణప్రసాద్‌, అయిదో అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జి జి.శ్రీనివాస్‌రెడ్డి, వివిధ సంస్థల న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు