logo

అయిదేళ్లలో రైతులను నిండా ముంచారు!

ఎర్రకాలువకు వరదొస్తే నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాల రైతులు వణికిపోతున్నారు. దీని ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు.

Published : 10 May 2024 05:38 IST

న్యూస్‌టుడే, నిడదవోలు: ఎర్రకాలువకు వరదొస్తే నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాల రైతులు వణికిపోతున్నారు. దీని ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. 2018 ఆగస్టులో 1.23 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో వరదలు రావడంతో కాలువ గట్టు పూర్తిగా జారిపోయింది. వేలమంది రైతులు నిండా మునిగిపోయారు. ఎర్రకాలువ వరద ప్రవాహ పరిస్థితిని అంచనా వేయడానికి నిపుణుల కమిటీ ఒకటి గతంలో పర్యటించింది. 1.54 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించేలా డిజైన్‌ చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. 2020, 2021లోనూ వరదలొచ్చి వేలమంది రైతులు నష్టపోయారు. అయినా ఈ అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు