logo
Published : 01/12/2021 01:03 IST

అరుదైనశస్త్రచికిత్సకుఅవార్డు

ఆకాష్‌కు ధ్రువపత్రం అందజేస్తున్న శేషాద్రి శేఖర్‌, పక్కన హనుమ శ్రీనివాసరెడ్డి

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: మూడు కాళ్లతో జన్మించిన ఓ నవజాత శిశువుకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని సమగ్రంగా వివరించిన విద్యార్థి వైద్యుడు ఆకాష్‌కు తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ స్థానం దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల వైద్యుల ఆధ్వర్యంలో న్యూరోకాన్‌-2021 పేరుతో సదస్సు నిర్వహించారు. న్యూరోసర్జరీ విభాగం రెండో యూనిట్‌ అధిపతి శేషాద్రి శేఖర్‌, సహాయ ఆచార్యులు హనుమ శ్రీనివాసరెడ్డి మార్గదర్శకంలో విద్యార్థి వైద్యుడు ఆకాష్‌ ఈ సదస్సులో సమర్పించిన పత్రానికి అభినందనలు వెల్లువెత్తాయి. ఆడ బిడ్డకు నడుంలోని వెన్నుపాము నుంచి మూడో కాలు వచ్చినట్లు గుర్తించామని, ఆ కాలుకు పురుష జననాంగాలు అతుక్కొని ఉన్నట్లు తెలుసుకున్నామన్నారు. ఇందుకు కారణం ఎక్కువగా జన్యుపరమైన అంశాలని చెప్పవచ్చని తెలిపారు. గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆ సమస్యను సరిచేసే నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నందున ఈ ఏడాది మార్చి 31న విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి మూడో కాలును తొలగించామని వివరించారు. దీంతో ఆ బిడ్డ తిరిగి సాధారణ జీవనాన్ని గడిపేందుకు మార్గం సుగమమైందని సదస్సులో వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి కేసులు 25 మాత్రమే నమోదైనట్లు చెప్పారు. అనంతరం జరిగిన క్విజ్‌ పోటీల్లో విద్యార్థి వైద్యుడు ధీరజ్‌కు రెండో స్థానం దక్కింది. జీజీహెచ్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో విజేతలు ఆకాష్‌, ధీరజ్‌లకు పురస్కారాలు, ప్రతిభ ధ్రువపత్రాలను శేషాద్రి శేఖర్‌, హనుమ శ్రీనివాసరెడ్డి అందజేశారు. గుంటూరు వైద్య కళాశాల ప్రధానాచార్యులు పద్మావతిదేవి, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ నాగేశ్వరమ్మ విజేతలను ప్రత్యేకంగా అభినందించారు.

 

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని