logo

రుణదాతల్లో కలవరం

పట్టణానికి చెందిన వ్యాపారి ఒకరు అప్పులు చెల్లించకుండా పరారైన అంశం వెలుగు చూసింది. పాతూరుకు చెందిన ఓ వ్యాపారి నెస్లే, ఇతర కంపెనీలకు పంపిణీదారుగా ఉన్నాడు. 25 ఏళ్లుగా నమ్మకాన్ని పొందిన అతను

Published : 20 May 2022 04:15 IST

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే : పట్టణానికి చెందిన వ్యాపారి ఒకరు అప్పులు చెల్లించకుండా పరారైన అంశం వెలుగు చూసింది. పాతూరుకు చెందిన ఓ వ్యాపారి నెస్లే, ఇతర కంపెనీలకు పంపిణీదారుగా ఉన్నాడు. 25 ఏళ్లుగా నమ్మకాన్ని పొందిన అతను రూ.25 కోట్ల మేర అప్పులు తీసుకున్నాడు. వారం రోజులుగా అతను కనిపించక పోవడంతో అప్పులిచ్చిన వ్యక్తులు అతని ఇంటికి వెళ్లి విచారించారు. అప్పులతో తమకు సంబంధం లేదని కుటుంబ సభ్యులు చెప్పగా హతాశులయ్యారు. కొందరు బాకీదారులకు గుంటూరులో వ్యాపారి కనిపించడంతో ప్రశ్నించగా అప్పులు తీర్చే పరిస్థితి లేదని బదులిచ్చినట్లు తెలిసింది. వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పులే కాకుండా ఒక వాణిజ్య బ్యాంకులో రూ.4 కోట్ల మేర రుణం ఉన్నట్లు సమాచారం. రెండేళ్లుగా బ్యాంకుకు వడ్డీ సైతం చెల్లించడం లేదని కూడా వెల్లడైంది. ఇదిలా ఉండగా రుణదాతలు 70 మంది వరకు ఉన్నారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

రాజీ ప్రయత్నాల్లో ప్రముఖులు
వ్యాపారి పరారీ అంశంపై రాజీ చేసేందుకు వ్యాపార వర్గాలకు చెందిన ఇద్దరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వారిలో ఒకరు ఔషధ రంగానికి చెందిన వ్యక్తి కాగా మరొకరు స్థిరాస్తి, చిట్టీల వ్యాపారిగా చెబుతున్నారు. నష్టాల పాలైన వ్యాపారి అప్పు తీర్చే పరిస్థితి లేని కారణంగా రాజీకి వచ్చి సెటిల్‌ చేసుకోవాలని చెబుతున్నట్లు సమాచారం. కాగా వ్యాపారంలో నష్టపోయింది పెద్దగా ఏమీ లేదని రుణం తీర్చే పరిస్థితికి డోకా లేదని రుణదాతలు వాదిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని