logo

‘కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలి’

రాజధానికి వెళ్లే మార్గంలోని కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అధికారులను ఆదేశించారు.

Published : 24 May 2022 04:45 IST

ఈనాడు-అమరావతి: రాజధానికి వెళ్లే మార్గంలోని కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆయన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), పురపాలకశాఖల అధికారులతో సమావేశమై సీఆర్‌డీఏ పనుల ప్రగతిని సమీక్షించారు. సీఆర్‌డీఏ, జలవనరులశాఖ అధికారులు సమన్వయంతో కరకట్ట పనులు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. విస్తరణ పనులకు అడ్డంకిగా ఉన్న విద్యుత్తు స్తంభాలు మార్చుతున్నామని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని అధికారులు మంత్రికి వివరించారు. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పనులపై అధికారులు ‘పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌’ ఇచ్చారు. పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు సంబంధించి పది పుర, నగరపాలక సంస్థల్లో నెలాఖరులోగా 8 లక్షల బుట్టలు పంపిణీ చేస్తామని పురపాలకశాఖ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంత్రికి వరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని