MLC Anantahababu: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎదురుదెబ్బ

దళిత యువకుడు, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ

Published : 26 Sep 2022 13:15 IST

అమరావతి: దళిత యువకుడు, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పోలీసులు 90 రోజుల్లో ఛార్జ్‌షీట్‌ వేయనందున బెయిల్‌ మంజూరు చేయాలని అనంతబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయన బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసింది.

కింది కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతో అనంతబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఆయన ఉన్నారు. ఇటీవలే అనంతబాబు రిమాండ్‌ గడువును స్థానిక ఎస్సీ, ఎస్టీ కోర్టు మరోసారి పొడిగించింది. అక్టోబర్‌ 7 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని