logo

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్‌లో జీఎంసీకి మరోసారి నిరాశే

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ జాతీయస్థాయిలో ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్‌- 2022 ర్యాంకింగ్‌లో ఈఏడాది కూడా గుంటూరు నగరపాలకసంస్థ(జీఎంసీ)కు నిరాశే ఎదురైంది. ఈఏడాది కూడా వందకు పైన ర్యాంకుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జీఎంసీ జాతీయస్థాయిలో 108వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.

Published : 02 Oct 2022 05:32 IST

నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: స్వచ్ఛ భారత్‌ మిషన్‌ జాతీయస్థాయిలో ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్‌- 2022 ర్యాంకింగ్‌లో ఈఏడాది కూడా గుంటూరు నగరపాలకసంస్థ(జీఎంసీ)కు నిరాశే ఎదురైంది. ఈఏడాది కూడా వందకు పైన ర్యాంకుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జీఎంసీ జాతీయస్థాయిలో 108వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులు 2016 నుంచి జాతీయస్థాయిలో ప్రకటిస్తుండగా ఒక్కసారి కూడా నగరపాలకసంస్థ వంద లోపు ర్యాంకు సాధించలేక పోయింది. గతేడాది జాతీయస్థాయిలో 130వ స్థానం, రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. చెత్త సేకరణకు 220 ఈ- ఆటోలు త్వరలోనే అందుబాటులోకి రానున్నందున ఇంటింటి చెత్త సేకరణ, తరలింపు, ఘన వ్యర్థాల నిర్వహణ, హోం కంపోస్ట్‌, ప్లాస్టిక్‌ నిషేధం పక్కాగా అమలు వంటి వాటిపై పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని