logo

మల్లెపూలకు రెక్కలు

దసరా ఉత్సవాల సందర్భంగా పూలకు గిరాకీ ఏర్పడింది. కేజీ మల్లెపూల ధర రూ.వెయ్యి పలికింది. ఈ సీజన్‌లో మల్లె పూల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.

Published : 05 Oct 2022 03:53 IST

బాపట్ల, న్యూస్‌టుడే: దసరా ఉత్సవాల సందర్భంగా పూలకు గిరాకీ ఏర్పడింది. కేజీ మల్లెపూల ధర రూ.వెయ్యి పలికింది. ఈ సీజన్‌లో మల్లె పూల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మండపాల అలంకరణ, అమ్మవారి పూజకు భక్తులు పూలు వినియోగిస్తున్నారు. మండలంలో వెదుళ్లపల్లి మార్కెట్ నుంచి మల్లెలు, గులాబీలు, కనకాంబరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలకు రవాణా అవుతున్నాయి. నగరాల్లో వ్యాపారుల నుంచి డిమాండ్‌ బాగా పెరగటంతో పూల ధర అమాంతం పెరిగింది. ధర ఎక్కువగా ఉన్నా పండగకు తప్పటం లేేదంటూ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని