logo

హోంగార్డుల సేవలు స్పూర్తిదాయకం

హోంగార్డుల సేవలు పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అన్నారు.

Published : 07 Dec 2022 04:21 IST

గౌరవ వందన స్వీకరిస్తున్న ఎస్పీ రవిశంకర్‌రెడ్డి

నరసరావుపేట టౌన్‌, న్యూస్‌టుడే: హోంగార్డుల సేవలు పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అన్నారు. నరసరావుపేటలోని జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ 1963లో ఏర్పడిన ఈవ్యవస్థ తమ శాఖలో అంతర్భాగమైందని, పోలీసు కానిస్టేబుళ్లతో పాటు సమానంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. పరేడ్‌ కమాండర్‌ హోంగార్డు శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఎస్పీకి హోంగార్డులు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్‌) బిందుమాధవ్‌, అదనపు ఎస్పీ (ఏఆర్‌) రామచంద్రరాజు, ఏఆర్‌ డీఎస్పీ చిన్నికృష్ణ, ఎస్బీ సీఐ ప్రభాకర్‌, ఆరైలు రవికిరణ్‌, వెంకటరమణ, రాజ్‌కుమార్‌, రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సేవా పురస్కారాలు అందజేత: జేవీఎస్‌.నాగేశ్వరరావు (నాదెండ్ల)కు అతిఉత్కృష్ట, షేక్‌ అక్తర్‌ (పోలీసు బ్యాండ్‌ పార్టీ), షేక్‌ మస్తాన్‌వలి (నరసరావుపేట ట్రాఫిక్‌), జేఎస్కే మస్తాన్‌వలి (సత్తెనపల్లి పట్టణం), ఏవై ప్రసాద్‌ (చిలకలూరిపేట టౌన్‌), టి.కోటేశ్వరరావు (చిలకలూరిపేట టౌన్‌), బి.రాంబాబు (డీపీవో)కు ఉత్కృష్ట సేవా పతకాలను ఎస్పీ అందజేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన హోంగార్డులు షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌కు రూ.5,41,020, ఎల్‌జే.మోహన్‌రావుకు రూ.5,36,760 చెక్కు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని