logo

‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’

ముఖ్యమంత్రి జగన్‌ మెడికల్‌ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత,

Published : 24 Apr 2024 06:52 IST

కొండపనేని టౌన్‌షిప్‌ వాసులతో మాట్లాడుతున్న యువనేత నారా లోకేశ్‌, వేదికపై అబద్దయ్య, శ్రీనివాసరావు

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ మెడికల్‌ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మంగళగిరి కొండపనేని టౌన్‌షిప్‌ వాసులతో ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉదయం సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. మెడికల్‌ సీట్లు అమ్ముకునే విధానానికి స్వస్తి పలుకుతామన్నారు. జగన్‌ అధికారం చేపట్టిన తరువాత ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశానన్నారు. రూ.1200 కోట్ల మేర బిల్లులు చెల్లించపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులలో ఈ పథకం కింద వైద్యం అందిచడం లేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకాన్ని ప్రక్షాళనం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. గత అయిదేళ్లలో తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచినప్పటికీ కోతలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. ఆనాడు చంద్రబాబు సోలార్‌ పవర్‌ సంస్థలతో యూనిట్‌ రూ.2.45కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటే.. దాన్ని రద్దు చేసిన జగన్‌ ఓపెన్‌ మార్కెట్‌లో యూనిట్‌ రూ.10కి కొనుగోలు చేస్తున్నారన్నారు. దీనివల్ల వినియోగదారులపై విద్యుత్తు ఛార్జీల భారం పెరిగిందన్నారు. దళితుల కోసం తెదేపా ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారని, వాటన్నింటినీ పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని