logo

జీఎంసీకి రూ.5 లక్షల జరిమానా

గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ప్రస్తుతం ఉన్న 250 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుగుణంగా తగినంత మంది బోధనానిపుణులు, ఇతర సదుపాయాలు లేనందున రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) అధికారులు ఆదేశించారు.

Published : 02 May 2024 06:22 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ప్రస్తుతం ఉన్న 250 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుగుణంగా తగినంత మంది బోధనానిపుణులు, ఇతర సదుపాయాలు లేనందున రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) అధికారులు ఆదేశించారు. 2019లో జీఎంసీలో 250 సీట్లకు అనుమతి మంజూరు చేశారు. అయిదేళ్లు పూర్తయినందున ఆ సీట్ల గుర్తింపును పునరుద్ధరించాల్సిందిగా ప్రిన్సిపల్‌ ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. ఎన్‌ఎంసీ నుంచి గతంలో వలే కళాశాలకు వచ్చి పరిశీలించకుండా వర్చువల్‌గానే దరఖాస్తులో ఉన్న వివరాలను పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నారు. కొన్ని విభాగాల్లో వైద్యుల హాజరు 75 శాతం లేదని, ట్యూటర్లు, సహాచార్యుల కొరత ఉందని ప్రధానంగా లోపాలను ఎత్తి చూపారు. వీటిని సరిచేసుకునేందుకు ఆరు నెలల గడువు మంజూరు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు